
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కుటుంబ పోషణకై ఇతరుల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసిన కౌలు రైతులను అకాల భారీ వర్షం చేతికి అంది వచ్చిన సమయంలో నిండా ముంచింది. బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు మొoథా తుఫాన్ కారణంగా కురిసిన అతి భారీ వర్షం వల్ల హుజురాబాద్ పట్టణంలోని గుండ్ల చెరువు, మోడల్ చెరువు వరద నీటితో పొంగి పొర్లాయి. హుజురాబాద్ పట్టణంలో బుధవారం 24.5 సెంటీమీటర్ల వర్షం కురవడంతో చిలకవాగు ఉధృతంగా పొంగి ప్రవహించడంతో రంగనాయకుల గుట్ట సమీపంలో ఉన్న పలువురు కౌలు రైతుల పోలాలు నీటితో నిండిపోయాయి. మరో రెండు రోజులైతే వరి కోతలు చేసి తాము కౌ లుకు తీసుకున్న దానికి ఫలితం ఉండేదని, రోజంతా కురిసిన వర్షంతో తాము మూడు నెలల పాటు పడిన కష్టం అకాల వర్షం నీటితో పొలం నిండడంతో ఆశలు నిరాశలయ్యాయని అన్నారు. రైతులు పంట నష్టపోతే ప్రభుత్వం నుండి ఏదో రకంగా నష్టపరిహారం లభిస్తుంది కానీ కౌలు రైతులకు నష్టం జరిగితే వారికి ఎలాంటి నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో తాము ఆరుగాలం కష్టపడి పెట్టిన పెట్టుబడి అంతా నీటిలో కొట్టుకుపోయింది అని ఆవేదన వ్యక్తం చేశారు.


గుండ్ల చెరువు కింద నీట మునిగిన పంట పొలాలను చూపుతున్న రైతులు..

– ప్రభుత్వం ఆదుకోవాలి..
కౌలు రైతు శ్రీనివాస్
సెంటు భూమి లేకపోవడంతో జీవనోపాధి కోసం 4 ఎకరాల పొలంలో కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశానని, మొoథా తుఫాన్ వల్ల తన పొలం పూర్తిగా నీటిలో మునిగిపోయిందని హుజురాబాద్ కు చెందిన కౌలు రైతు తొర్రి శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాన్ తో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు.






