Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
క్రీడాకారులకు నిలయమైన హుజురాబాద్ లోనే స్టేడియం నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సొల్లు బాబు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ… గత నాలుగు దశాబ్దాలుగా హుజురాబాద్ ప్రాంతం అనేక క్రీడలకు పుట్టినిల్లుగా ఉందని, ఇక్కడ రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించిన ఘనత ఈ ప్రాంత క్రీడాకారులకు ప్రజలకు ఉందన్నారు. హుజురాబాద్ లో స్టేడియం నిర్మిస్తే క్రీడలకు మరింత ప్రోత్సాహం లభించినట్లు అవుతుందన్నారు. జూనియర్ కళాశాల మైదానంలో కానీ, జమ్మికుంట రోడ్ లోని చంద్రవానికుంటలో కానీ నిర్మిస్తే బాగుంటుందన్నారు. ఇది హుజురాబాద్ నుండి జమ్మికుంట కు వెళ్లే మార్గ మధ్యలో ఉంటుందన్నారు 100 ఎకరాల భూమి ఉందని, ఇక్కడ విశాలమైన స్టేడియం నిర్మించవచ్చని ఆయన అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే పాడు కౌశిక్ రెడ్డిలు ఈ విషయంపై ఆలోచన చేయాలని అన్నారు. హుజురాబాద్ నుండి స్టేడియం జమ్మికుంటకు తరలించడం సరికాదని ఆయన అన్నారు. ఈ విషయంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు కూడా ఆ దిశగా అడుగులు వేసి పార్టీలకు అతీతంగా అందరి సహకారంతో స్టేడియం హుజురాబాద్ లోనే నిర్మించుకోవాలన్నారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోల్లు బాబు





