
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
హక్కుల సాధనే లక్ష్యంగా బ్రాహ్మణ సంఘాలు ఓసి లందరిని కలుపుకొని సంఘటితంగా సంఘటితంగా ఉద్యమించాలని మాజీ రాజ్యసభ సభ్యులు పిలుపు నిచ్చారు.కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రము లో బుధవారం రాష్ర్ట బ్రాహ్మణ ఆర్గనైజేశన్స్ ఫర్ సోషల్ సర్వీసెస్ రాష్ట్ర జిల్లాల నాయకుల సమావేశం రాష్ర్ట అధ్యక్షుడు బసవరాజు శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు దీనికి రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలోప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలనే ప్రథాన డిమాండ్ తో జనవరి 11న వరంగల్ లో నిర్వహించ తలపెట్టినరాష్ట్ర వ్యాప్త ఓసిల సింహగర్జన సమరభేరికి రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులు, ఇతర ఓసి సామాజిక వర్గీయులందరూ తరలి రావాలని సమావేశంలో తీర్మానించారు.
ఈ సందర్భంగాముఖ్య అతితులుగా విచ్చేసిన మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ బ్రహ్మన సంఘాల్లో విడివిడిగా కాకుండా భేషజాలకు పోకుండా ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ల పటిష్ట అమలుకు రాజ్యాంగ కమిషన్ ఏర్పాటు చేయాలనే న్యాయమైన డిమాండ్ కు మద్దతు తెలుపుతున్నట్లు కెప్టెన్ అన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావుతో పాటు పలువురు ఐకాస నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్లపై స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతూ చేస్తున్న అసత్య ప్రచారాలను, కుట్రలను సాగమివ్వబోమని హెచ్చరించారు.
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతులు లేని 5 ఏండ్ల కాలపరిమితిని కలిగి ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. టెట్ అర్హత పరీక్ష మార్కులను ఈడబ్ల్యూస్ వర్గాలకు 90 నుంచి 70 మార్కులకు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కోరారు. తమ డిమాండ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందు కోసం జనవరి నెల 11న సాయంత్రం 3 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో లక్ష మందితో నిర్వహించతలపెట్టిన ఓసిల సింహగర్జన భారీ బహిరంగ సభకు ఓసి వర్గీయులందరూ రాజకీయాల కతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్, కరపత్రాలను సమావేశంలో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సతీశ్ బాబు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే సతీశ్ బాబు, బ్రాహ్మణ సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు విష్ణుదాసు గోపాల్ రావు, దీపక్ బాబు, కొత్తకొండ రవీందర్ రావు, గౌతం శర్మ, మనోహర్ శర్మ,రఘురామాచర్యులు, కలకుంట్ల శేషాచార్యులు, ఆంజనేయశర్మ, రంగారావులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బ్రాహ్మణ సామాజిక వర్గీయులు హాజరైనారు. అంతకు ముందు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి, శ్రీ చైతన్య విద్యా సంస్థల అధినేత రమేష్ రెడ్డి, కరీంనగర్ డైరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి జోజీరెడ్డిలను సింహగర్జన సమరభేరి సభకు సంబంధించిన ఏర్పాట్లపై వివరించి సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను పోలాడి రామారావు అందజేశారు.

గోడపత్రికలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతున్న ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు









