
– ప్రజా ప్రతినిధులు వారి కుటుంబాన్ని ఆదుకోవాలి
• ఫౌండేషన్ చైర్మన్ కుడికాల భాస్కర్, డైరెక్టర్ చిలుక మారి శ్రీనివాస్ విజ్ఞప్తి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో అందేశ రమేష్ – భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు అభిరామ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ గత 3 రోజుల క్రితం చనిపోగా వారి కుటుంబాన్ని వారాహి ఫౌండేషన్ డైరెక్టర్ చిలుకమారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్, డైరెక్టర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం వితరణ చేయడం జరిగింది. ఈ అనంతరం వారు మాట్లాడుతూ… నిరుపేద కుటుంబానికి చెందిన అందేశ రమేష్ – భాగ్యలక్ష్మి నిరుపేద కుటుంబం అని, ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే స్థానిక ప్రజా ప్రతినిధులు వారికి అండగా నిలిచి ఆర్థికంగా సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారాహి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కుడికాల భాస్కర్, వారాహి ఫౌండేషన్ డైరెక్టర్ చిలుకమారి శ్రీనివాస్, వారాహి ఫౌండేషన్ డైరెక్టర్ జినుకల లక్ష్మణరావు పటేల్, ఇప్పకాయల సాగర్, మమునూరి ప్రవీణ్,తుని సమ్మయ్య, కొత్తూరి జీవన్, మాడుగుల సురేష్, సంఘాల రాజు, మైస కొమురయ్యా, ఎడ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మృతుని కుటుంబానికి బియ్యం వితరణ చేస్తున్న వారాహి ఫౌండేషన్ నిర్వాహకులు…






