
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(హైదరాబాద్): అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారు రిజర్వేషన్ల లేమి కారణంగా అటు సంక్షేమ పథకాల ఫలాలు, ఇటు రాజకీయ
పదవులు పొందలేక పోతున్నారని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
గురువారం హైదరాబాద్ లోని ఖాజా మాన్షన్ ఫంక్షన్ హాల్లో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ కులగణనలో కులగనన..సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు మాట్లాడుతూ… ఓసి ల జనాభా 21.5శాతం అండగా అందులో పటాన్లు, సయ్యద్ లు ఉన్నారని,
రాజకీయ రిజర్వేషన్లు లేని కారణంగా ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక, అంగ బలం ముందు ఓసి అభ్యర్ధులు సరితూగ లేక జనరల్ స్థానాల్లో కనీసం 50శాతం సీట్లు కూడా గెలుచుకోలేక పోయారని విచారం వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాలతో ఓసిలకు నేటికీ తీవ్ర అన్యాయం జరుగుతున్నదని అన్నారు. నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు త్వరలో జరగనున్న ఎన్నికల వార్డు రిజర్వేషన్లలో ఓసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. మున్సిపల్ రిజర్వేషన్లలో ఓసిలను అణగ దొక్కాలనే పాలకుల బ్యూరో క్రాట్ల కుట్ర స్పష్టంగా బయట పడిందన్నారు. ఓసిల జనాభా 80 శాతం ఉన్న వార్డుల, డివిజన్లు ఎస్సీ ఎస్టీ, బీసీలకు రిజర్వు కాగా, ఎస్సీ ఎస్టీ బీసీలు 79 నుంచి 88 శాతం ఉన్న ప్రాంతాలను జనరల్ కేటగిరీలో చేర్చడం పాలకుల బ్యూరో క్రాట్ల కుట్రకు నిదర్శనం అన్నారు. ప్రస్తుతం జనరల్ కేటగిరీకి రిజర్వు చేయబడిన స్థానాల్లో ఓసీయేతరులు 80 శాతం ఉండటంతో ఓసిలు అక్కడ గెలుపొందే పరిస్థితి లేదన్నారు. శాస్త్రీయంగా లేని రిజర్వేషన్ల మార్పుపై తక్షణమే ఒక నిర్ణయం తీసుకోని పక్షంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓసిలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం తథ్యమని నాయకులు హెచ్చరించారు. జనరల్ స్థానాల్లో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసీ యేతరులకు కొన్ని రాజకీయ పార్టీలు టికెట్ల ఇచ్చి ఓసిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇదే ఇదే విధమైన విధానాలు అనుసరించడం వల్ల ఓసిలు సర్పంచ్ అవకాశాలు కోల్పోయారని వెల్లడించారు. తాము ఏ వర్గాలకు వ్యతిరేకం కాదని, అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే ఓసి జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు. స్ధానిక ఎన్నికల్లో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లకు మద్దతు తెలుపని మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని పోలాడి హెచ్చరించారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..
,ఈడబ్ల్యూఎస్ పై కుట్రలు సాగనివ్వం…….
రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, కొందరు తమలబ్దికోసం చేస్తున్న కుట్రలను సాగానివ్వబోమని స్పష్టం చేశారు. దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్లపై కొందరు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఓసిలను పలుచన చేయాలనే కుయుక్తులను సాగనివ్వబోమని విరుచుకుపడ్డారు.
ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ, పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించగా మిగిలిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలన్నారు. ప్రస్తుతమున్న 59 శాతం దాటని రిజర్వేషన్లలో ఓసి లకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ఓసీలలోని నిరుపేదలకు వర్తింప చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జాతీయస్థాయి ఓసిల మహా ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకతీతంగా ఓసి సామాజిక వర్గీయులు తరలి వచ్చి విజయవంతం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా సమావేశంలో పాల్గొన్న పోలాడి రామారావు పిలుపు నిచ్చారు. ఫిబ్రవరి 23న డిల్లి మహాధర్నాకు మద్దతు ఇవ్వాలని జాగృతి అధ్యక్షురాలు కవితకు పోలాడి రామారావు ఆహ్వాన పత్రం అందజేయగా సానుకూలంగా స్పందించిన కవితకు పోలాడి రామారావు ఓసి జేఏసీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కులగణన..సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న పోలాడి రామారావు..


ఫిబ్రవరి 23న డిల్లి మహాధర్నాకు మద్దతు ఇవ్వాలని జాగృతి అధ్యక్షురాలు కవితకు పోలాడి రామారావు ఆహ్వాన పత్రం అందజేస్తున్న దృశ్యం.

కుల గణన పై మాట్లాడుతున్న జాగృతి అధ్యక్షురాలు కవిత


కులగణన..సమగ్ర చర్చ రౌండ్ టేబుల్ సమావేశంకు హాజరైన





