
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ జనవరి 29: హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం పలువురు నాయకులు అధికారికంగా బిఆర్ఎస్ పార్టీలో చేరారు. హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని 22వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా తలకొక్కుల శ్యామల – హరిప్రసాద్(మనిషా ఫోటో స్టూడియో ప్రసాద్) పార్టీలో చేరగా, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని ఘనంగా స్వాగతం పలికారు. దీంతో పట్టణ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరినట్లు అయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 22వ వార్డులో బిఆర్ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని, ప్రతి వార్డులోనూ పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. శ్యామల హరిప్రసాద్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి ప్యానాల భూపతిరెడ్డి, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొల్లిపాక శ్రీనివాస్, మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, సీనియర్ నాయకులు పోరెడ్డి శాంతన్ రెడ్డి, కట్కూరి మల్లారెడ్డి, చందా గాంధీ, వర్ధనేని రవీందర్ రావు, బొల్లు శ్రీనివాస్, ఆడెపు అనురాగ్, రాజు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


తలకోక్కుల శ్యామల హరిప్రసాదులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

బిఆర్ఎస్ పార్టీలో చేరిన తలకొక్కుల శ్యామల- హరిప్రసాద్ లు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతున్న దృశ్యం..





