
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి 30 : హుజురాబాద్ మున్సిపల్ 6వ వార్డులో బిఆర్ఎస్ యువ మహిళా నేత బండ సింధుజ తన తల్లిదండ్రులతో పాటు వార్డు ప్రజలతో కలిసి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తనను ఆరవ వార్డులో గెలిపిస్తే ఆ వార్డుతో పాటు పట్టణాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దుతానని, అరవ వార్డు ప్రజలు తనను ఆశీర్వదించండి!! అని బండ సింధుజ అన్నారు. ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ కుమార్తె అయిన బండ సింధుజ డిగ్రీ పూర్తి చేసింది. హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమె 6వ వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తోంది. ఆమె బిఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తుండగా, హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సి మహిళకు రిజర్వు కావడంతో సింధుజ పోటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె తండ్రి బండ శ్రీనివాస్ విద్యార్థిగానే రాజకీయ జీవితం ప్రారంభించారు. ఒకవైపు హాకీ క్రీడాకారునిగా, మరోవైపు కాంగ్రెస్ లో నాడు సింగాపురం’రాజేశ్వర్ రావు(సింగపూర్ దొర) అనుచరునిగా, శిష్యునిగా, ఎన్ఎస్యూ ఐ నేతగా, యూత్ కాంగ్రెస్ నేతగా పనిచేసారు. అలాగే ఎంపిటిసి సభ్యునిగా, టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యునిగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమంలో బండ క్రియాశీల పాత్ర పోషించారు. మరోవైపు సీనియర్ నేతలు కెప్టెన్ వి లక్ష్మీకాంతరావు, ఈటల రాజేందర్ ముఖ్య అనుచరునిగా పనిచేసారు. తాజాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ముఖ్య అనుచరునిగా, సీనియర్ నేతగా వ్యూహకర్తగా ఉన్నారు. హుజురాబాద్ లో బండ శ్రీనివాస్ అంటే తెలియనివారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గా బండ శ్రీనివాస్ క్రియాశీల పాత్ర పోషించారు. హుజురాబాద్ నియోజకవర్గ దళితులందరికి దళితబంధు అందజేయడంలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు. బండ శ్రీనివాస్ కు బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వద్ద మంచి గుర్తింపు ఉంది.

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మా తండ్రి శ్రీనివాస్ సహకారంతో వార్డును, పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా..: బండ సింధుజ
హుజురాబాద్ మా సొంత ఊరు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. అందుకే నాకు హుజురాబాద్ అంటే ఎంతో ప్రేమ. నాకు రాజకీయాలు కొత్తకాదు. నాన్న విద్యార్ధి దశ నుండి రాజకీయాల్లో ఉన్నారు. మా అమ్మానాన్నలది ఆదర్శ వివాహం. చిన్నప్పటి నుండి మా నాన్నను గమనిస్తున్నాను. నాన్న దగ్గరికి వచ్చే సందర్శకుల మాటలు వింటూ పెరిగాను. ప్రజాసమస్యలపై ఎప్పుడూ వారు స్పందించే తీరు చూస్తున్నాను. నాకు రాజకీయాలంటే ఆసక్తి ఉంది. కానీ అందుకు సరైన సమయం రావాలనుకొని ప్రస్తుతం అందుకు సరైన తరుణమని భావించి ఆరో వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయడం జరుగుతుంది. యువత రాజకీయాల్లోకి రావాలి. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాటలు మాలో స్ఫూర్తిని నింపుతాయి. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా యువతను ప్రోత్సహిస్తున్నారు. ఆరవ వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. పార్టీ అవకాశం ఇచ్చినందున.. తప్పకుండా వార్డు ప్రజల ఆదరాభిమానాలతో కౌన్సిలర్ గా పోటీలో గెలిచి అభివృద్ధిపై, సంక్షేమంపై, పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. ప్రజాస్వామ్యంపై విశ్వాసం, నమ్మకం ఉన్నాయి కనుక చైర్మన్ ఎన్నిక విషయంలో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఎవరైనా ఉండాల్సిందే. హుజురాబాద్ బిడ్డను నేను. రాజకీయాల్లో అడుగుపెడుతున్న నన్ను అందరూ ఆశీర్వదించాలని, మద్దతు ఇవ్వాలని ఆరో వార్డు ప్రజలతో పాటు పట్టణ ప్రజలను కోరుతున్నాను. ప్రజల ఆశలను వమ్ము చేయకుండా.. వారి ఆకాంక్షమేరకు నడుచుకుంటాను. ప్రజలతో మమేకమై పనిచేసి అభివృద్ధి, సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.. అని బండ సింధుజ చెప్తోంది. నామినేషన్ ప్రక్రియలో తనతో పాటు తల్లిదండ్రులు, వార్డు పెద్దలు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నామినేషన్ దాఖలుకు తన తండ్రి శ్రీనివాస్, వార్డు ఓటర్లతో కలిసి వెళ్తున్న బండ సింధుజ..

నామినేషన్ వేసేందుకు వెళుతూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరిస్తున్న సింధుజ..




ఆరో వార్డులో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్న బండ సింధుజ..





