
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ సీపీని మత మార్పిడి చేస్తున్నట్టు తాను అనలేదని, అలా అన్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు.
తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదనీ, నేను అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఆయన అన్నారు.
లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు క్షమాపణ చెప్పాలనీ, క్షమాపణ చెప్పుకుంటే ప్రి విలేజ్ మోషన్ మూవ్ చేస్తా ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..





