
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడవ వార్డులో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ, పదేళ్లలో జరగనివి, రెండేళ్లలో జరిగిన పనులను ప్రజలకు వివరంగా తెలియజేస్తున్నారు. హుజురాబాద్ పట్టణంలోని 3వ వార్డులో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆ అవార్డు కాంగ్రెస్ అభ్యర్థి రావుల ప్రభాకర్ తో కలిసి ఇంటి, ఇంటికి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారం చేసే సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావుల ప్రభాకర్ కు స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సారి పక్కగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను నిండు మనసుతో ఆశీర్వదిస్తే మరింత బాధ్యతగా అభివృద్ధి చేస్తామని ప్రణవ్ బాబు, రావుల ప్రభాకర్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హుజురాబాద్ పట్టణంలోని మూడవ వార్డులో అభ్యర్థి రావుల ప్రభాకర్ కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత ప్రణవ్ బాబు, పక్కన రావుల ప్రభాకర్..

3వ వార్డులో వృద్ధుడిని ఓటు అభ్యర్థిస్తున్న ప్రణవ్ బాబు, కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్..

మూడో వార్డులో ప్రణవ్ బాబుకు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్న ఓటర్లు..


మూడవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రావుల ప్రభాకర్ ఎన్నికల ప్రచారానికి హోరెత్తిన (భారీగా తరలివచ్చిన) ప్రజలు..





