
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. హుజూరాబాద్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ, కౌన్సిలర్ తోగురు సదానందం ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరారు. ఈ మేరకు ప్రణవ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికలు ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయం తధ్యం అని, పట్టణాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రణవ్ తోనే సాధ్యమని నూతనంగా చేరిన వారు అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పార్టీలో చేరిన సదానందంకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రణవ్..






