
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోనీ 12వ వార్డు నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వర్దినేని రవీందర్ రావు నామినేషన్ వేసి
ఈ రోజు వార్డ్ పరిధిలోని ముక్కపల్లి, కోళ్లఫారాల వద్ద తన మద్దతుదారులతో కలిసి ఇంటింట తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నన్ను ఓటేసి ఆశీర్వదించండి…మీ సేవ చేసే అవకాశాన్ని ఇవ్వండి అని రవీందర్ రావు కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఒక పండుగ లాంటివి, ఈ పండుగలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను ప్రతిబింబించాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉంటుంది గనుక
అటువంటి బాధ్యతను భుజాన వేసుకుని, నేను మీ వార్డ్ లో పోటీ చేస్తున్న అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యంగా, సేవే నా సిద్ధాంతంగా,
సత్యం–నిజాయితీ–నిబద్ధత అనే విలువలతో
నేను ఈ ఎన్నికల బరిలోకి అడుగుపెడుతున్నాను అని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
నేను మీ మధ్యలోనే తిరిగే వ్యక్తిని, మీ కష్టాలు నాకు తెలుసు, మీ సమస్యలు నాకు అనుభవమే. మీ ఆశలు నా ఆశలే. అందుకే నేను 24 గంటలు మన వార్డులోనే ఉంటూ మీ ఇంటి బిడ్డగా, మీలో ఒకడిగా మీ మాట వినే ప్రతినిధిగా, మీ తరఫున పోరాడే నాయకుడిగా
మీ సేవ చేసేందుకు ముందుకు వస్తున్నాను అని అన్నారు.


కోళ్ల ఫారాల వద్ద ఇంటింటా ప్రచారామ్ నీర్వహిస్తున్న రవీందర్ రావు, ఆయన వెంట ఉన్న 12వ వార్డు ఓటర్లు..
ఇప్పటివరకు మన వార్డులో అక్కడక్కడ తాగునీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి, పారిశుధ్య లోపాలు, వీధి దీపాల సమస్యలు,
యువతకు అవకాశాల లేమి, మహిళల భద్రత,
పేదల సంక్షేమం వంటి అనేక సమస్యలు
పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఎలాంటి సమస్యలు లేని వార్డుగా మార్చాలనే తపనతోనే నేను మీ ముందుకు వస్తున్నాను అన్నారు.
మీరు నాపై ఉంచే నమ్మకం ఒక్కసారి కాదు, ప్రతి రోజు, ప్రతి సమస్యలో మీతో పాటు నిలబడే బాధ్యతగా భావిస్తాను అన్నారు. మీ అమూల్యమైన ఒక్క ఓటు బిఆర్ఎస్ కారు గుర్తుకు వేయడం ద్వారా నన్ను ఆశీర్వదించి, మీ సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మీరు నాపై ఉంచే ప్రతి నమ్మకాన్ని
ఎప్పటికీ వృథా చేయకుండా, ప్రతి రూపాయి అభివృద్ధికే ఖర్చు చేసేలా, ప్రతి పని పారదర్శకంగా జరిగేలా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా నిబద్ధతతో, నిజాయితీగా పని చేస్తానని ఈ సందర్భంగా మీకు మాట ఇస్తున్నాను అన్నారు. 12వ వార్డు సమగ్ర అభివృద్ధే నా ధ్యేయం అని, ప్రజల సంక్షేమమే నా లక్ష్యం అన్నారు. సమస్యల పరిష్కారమే నా కార్యాచరణ, ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతూ వార్డును మున్సిపల్ పరిధిలోనే కాక జిల్లాలోనే ఉత్తమ వార్డుగా నిలిపేందుకు కృషి చేస్తానని రవీందర్రావు స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, పేదల పక్షాన నిలబడే పార్టీగా, ప్రజల గొంతుకగా, సమస్యలపై రాజీ పడని నాయకుడిగా
మీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇస్తున్నాను అని రవీందర్ రావు పేర్కొన్నారు. ఆయన వెంట ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


రవీందర్ రావుకు మద్దతుగా ఇంటింటా ప్రచారానికి బయలుదేరుతున్న మద్దతుదారులు, 12వ వార్డు ఓటర్లు…





