
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 11న జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో 26వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పుల్లూరి శ్రీకాంత్ఈ రోజు వార్డు పరిధిలోని జెకె వీధి, పత్తి వాసుదేవరెడ్డి కాంప్లెక్స్ వద్ద ఇంటింట తిరుగుతూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఈ ఎన్నికలలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను ప్రతిబింబించాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉంటుందనీ,
అటువంటి బాధ్యతను భుజాన వేసుకుని, ప్రజల సమస్యల పరిష్కారమే నా లక్ష్యంగా, సేవే నా సిద్ధాంతంగా, సత్యం, నిజాయితీ, నిబద్ధత అనే విలువలతో నేను ఈ ఎన్నికల బరిలోకి అడుగు పెడుతున్నాను అని అన్నారు. నేను మీ మధ్యలోనే తిరిగే వ్యక్తిని, మీ కష్టాలు నాకు తెలుసు, మీ సమస్యలు నాకు తెలుసు కనుక వాటిని నెరవేర్చడం కూడా నాకు తెలుసు అన్నారు. నేను 24 గంటలు మన వార్డులోనే ఉంటూ మీ ఇంటి బిడ్డగా మీలో ఒకడిగా మీ మాట వినే ప్రతినిధిగా మీ తరఫున పోరాడే నాయకుడిగా మీ సేవ చేసేందుకు ముందుకు వస్తున్నాను అని అన్నారు. ఇప్పటివరకు మన వార్డులో పూర్తిస్థాయిలో తాగునీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల దుస్థితి, పారిశుధ్య లోపాలు, వీధి దీపాల సమస్యలు లేకుండా పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు.
మహిళల భద్రత, పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. వార్డులో ఉన్న అనేక సమస్యలు పరిష్కారానికి తనవంతుగా కృషి చేసి, అలాంటి పరిస్థితిని మార్చాలనే తపనతోనే నేను మీ ముందుకు వస్తున్నాను అని చెప్పారు. మీరు నాపై ఉంచే నమ్మకం ఒక్కసారి కాదు, ప్రతి రోజు, ప్రతి సమస్యలో మీతో పాటు నిలబడే బాధ్యతగా భావిస్తాను అని శ్రీకాంత్ పేర్కొన్నారు. మీ అమూల్యమైన ఒక్క ఓటు చెయ్యి గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించి, మీ సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని కాంగ్రెస్ అభ్యర్థి శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.
మీరు నాపై ఉంచే ప్రతి నమ్మకాన్ని ఎప్పటికీ వృథా చేయకుండా, మంజూరయ్యే ప్రతి రూపాయి అభివృద్ధికే ఖర్చు చేసేలా, ప్రతి పని పారదర్శకంగా జరిగేలా, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా నిబద్ధతతో, నిజాయితీగా పని చేస్తానని అన్నారు. వార్డు సమగ్ర అభివృద్ధే నా ధ్యేయమనీ, ప్రజల సంక్షేమమే నా లక్ష్యం అని, సమస్యల పరిష్కారమే నా కార్యాచరణగా ముందుకు సాగుతాననీ అన్నారు. ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ,
పేదల పక్షాన నిలబడే పార్టీగా, ప్రజల గొంతుకగా,
సమస్యలపై రాజీ పడని నాయకుడిగా కొనసాగుతానని శ్రీకాంత్ పేర్కొన్నారు.


జెకె వీధిలో ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పుల్లూరు శ్రీకాంత్..




26వ వార్డులో ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ చేయి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్న ఆ వార్డు అభ్యర్థి పుల్లూరు శ్రీకాంత్..





