
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 3: హుజురాబాద్ పట్టణంలోనీ 26వ వార్డులో మునిసిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసిరెడ్డి లావణ్యకు ఆ వార్డు మహిళలు సంఘీభావం ప్రకటించారు. మంగళవారం సాయంత్రం వార్డులోని జెకె వీధిలో మహిళలు లావణ్య నరసింహారెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. లావణ్య నరసింహారెడ్డి 26వ వార్డు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేశారని ప్రశంసించారు. నాలుగోసారి కౌన్సిలర్ గా భారీ మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. వార్డు సభ్యుల, ప్రజల, ఓటర్ల అభివృద్ధి సంక్షేమం కోసం వారు నిరంతరం పరితపిస్తున్నారని, శ్రమిస్తున్నారని అన్నారు. ఎప్పుడు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ అవసరం వచ్చిన వెంటనే స్పందిస్తున్నారని పేర్కొన్నారు. మరోసారి లావణ్యను కౌన్సిలర్ గా భారీ మెజార్టీతో గెలిపిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ముక్క అరుణ కృష్ణమూర్తి, షీలా లత, మునుగంటి స్వరూపరాణి, ఇనుగాల లచ్చమ్మ, గట్టు రాజేశ్వరి, తాటిపాముల యశోద, ఉడుత లత తదితరులు ఉన్నారు.






26వ వార్డులో మునిసిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసిరెడ్డి లావణ్యకు ఆ వార్డు మహిళలు సంఘీభావం ప్రకటించి, ఘనంగా సత్కరిస్తున్న దృశ్యాలు..



సూపర్ బజార్లో ప్రచారం చేస్తున్న కేసిరెడ్డి లావణ్య..





