
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ లోని అంబేడ్కర్ కూడలి వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా BRS యూత్ నియోజకవర్గ ఇంచార్జి తొగరు శివకృష్ణ, బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు తొగరు బిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి బిక్షపతి శివకు తినిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ కెసిఆర్ నిండా నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. గత పదేళ్ల క్రితం బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప నేడు జరుగుతున్న అభివృద్ధి శూన్యం అన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ఇంచార్జి తులసి లక్ష్మణ మూర్తి, BC ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు వెంకన్న, ఇప్పకాయల సాగర్, మామునూరి ప్రవీణ్, తాళ్ళపెల్లి రాజేష్, కోలిపాక క్రాంతికుమార్, PACS మాజీ డైరెక్టర్ సంఘాల రవీందర్, ఉపసర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు వన్నాల శివాజీ, యూత్ నాయకులు ప్రణయ్, రాజు కుమార్, సంతోష్, మహేందర్, ఎడ్ల రమేష్, అజయ్, తునికీ నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా జన్మదిన కేక్ కట్ చేస్తున్న బీఆర్ఎస్ యూత్ నాయకులు శివ, బిక్షపతి..






