
–హాజరుకానున్న పలువురు కేంద్ర, మంత్రులు,mp లు. వివిధ రాష్ట్రాల మంత్రులు పార్టీలా నాయకులు, రైతు ప్రజాసంఘాల నాయకులు.
–ఓసి సామాజిక, సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.. వెల్లడి.
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(హైదరాబాద్): ఓసిల హక్కుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 23న ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయిలోఓసి ల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, వర్కింగ్ కమిటి అధ్యక్షులు తాడిశెట్టి పశుపతి, ఉపాధ్యక్షులు, ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది కటంగూరి బుచ్చిరెడ్డి లు తెలిపారు. బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఓసి ఐకాస రాష్ట్ర నాయకులతో మహాధర్నా ఏర్పాట్ల గురించి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అగ్రకులాలలోని పేద విద్యార్థినీ,విద్యార్థులు రైతులు, మహిళలకు విద్య, ఉద్యోగ, ఉపాధి,రాజకీయ త్ రంగాలలో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెచ్చే ఉద్దేశంతో రాజకీయాల కతీతంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేయాలని, ఓసి కులాల స్థితిగతుల అధ్యయనానికి జాతీయస్థాయిలో ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లను ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం ముందు ఉంచనున్నట్టు పోలాడి రామారావుతో పాటు నాయకులు తెలిపారు. 23వ తేదీ ఉదయం 11గంటల నుండి ప్రారంభమయ్యే ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే అధికారికంగా అన్ని అనుమతులు పొందినట్లు తెలిపారు.

ఈ ధర్నా కార్యక్రమం ఓసీలలోని వెనుకబడిన వర్గాల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై కను విప్పు కలిగే విధంగా ఉంటుందని రామారావు తెలియజేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి ఓసీలలోని నిరుపేదలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు. ఈ ధర్నా కార్యక్రమానికి పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరై సంఘీభావం ప్రకటిస్తారని
తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే వారందరికీ ఆహ్వానాలు అందజేసినట్లు వివరించారు.
ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి షరతుల్లేని 5 ఏండ్ల కాలపరిమితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అర్హత ఓకె విధంగా కలిగి ఉండాలని, ఈడబ్లూఎస్ అర్హతకు వార్షికాదాయ పరిమితి 10 లక్షలకు పెంచాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అగ్రవర్ణ నిరుపేదలకు వర్తింప చేయాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించగా మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను వారితోనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లలో అన్ని వర్గాల పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని అందువల్ల రిజర్వేషన్లలో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయటానికి ప్రత్యేక చట్టం తేవాలని సూచించారు. ప్రస్తుతం 50శాతం దాటకుండా ఉన్న రిజర్వేషన్లలో ఓసిలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు అన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులు పండించిన పంటలకు రైతే ధర నిర్ణయించుకునే విధంగా చట్టం తేవాలని, రైతులకు రైతు భీమా వర్తించే పరిమితిని 70 సంవత్సరాలకు పెంచాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానించి రైతులు, వ్యవసాయ రైతు కూలీలకు సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించిన తప్పుడు విధానాలు పునరావృతం కాకుండా శాస్త్రీయ పద్ధతిలో పారదర్శకంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓసిలకు ఓటు బ్యాంక్ రాజకీయాలతో అన్యాయం చేయవద్దని పోలాడి రామారావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలాడి రామారావుతో పాటు ఓసి ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి, ఉపాధ్యక్షులు చందుపట్ల నరసింహరెడ్డి, రేణికుంట్ల నమశ్శివాయ, ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది కటంగూరి బుచ్చి రాంరెడ్డి, న్యాయవాది నాగర్తి రాజకుమార్ రెడ్డి, నిట్టూరి సతీశ్ శర్మ తదితరులు ఉన్నారు.







