
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోనీ శివాజీ నగర్ లో, అహల్యనగర్ లో చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు వేరువేరుగా ఘనంగా జరిగాయి. పట్టణంలోని శివాజీ నగర్ లో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు ప్రతాప మంజుల, కాళిదాస్ లక్ష్మీదుర్గ, కొండం ప్రశాంతి, దామెర అనూష, పంజాల మనోజ్, ఇల్లందుల సమ్మయ్యలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చైర్పర్సన్ సుహాసిని మాట్లాడుతూ శివాజీ వీరత్వం మన దేశ యువకుల ధీరత్వానికి గుర్తు అని అన్నారు. శివాజీ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరే క్షత్రియ సంఘ పెద్దలు భూసారపు కనకయ్య, హనుమంతు, శంకర్, బాపూరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.



—అహల్య నగర్ లో…
ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని అహల్యనగర్ లో అరె మరాఠి సంఘo ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బోర్నపల్లి కెనాల్ నుండి పురవిధుల గుండా నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం శివాజీ విగ్రహానికి కౌన్సిలర్లు వజ్జపల్లి వెంకటేశ్వర్లు, నాంపల్లి. శ్రీనివాస్, వర్దినేని రవీందర్ రావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శివాజీ దేశభక్తి ఆయన పరిపాలన దక్షత అంశాలను వివరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆరే మరాఠీ సంఘం రాష్ట్రసంఘ ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ అంగీరక సంపత్ రావు, అధ్యక్షులు కౌడగాని సాంబయ్య, కార్యదర్శి సంపత్ రావు, అంగీరక ప్రసాద్, కొండ గణేష్, బిసి ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, పంజాల తిరుపతి గౌడ్, నడిగోటి రమేష్, మామునూరి ప్రవీణ్, ఇల్లందుల తిరుపతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.











