
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పురపాలక సంఘం 21వ వార్డుకు చెందిన పోగు పుష్పలత- సుదర్శన్ ల కుమార్తె తేజస్విని వివాహం శుక్రవారం ఉండగా 21వ వార్డు కౌన్సిలర్ పంజాల మనోజ్ తన కానుకగా 10,116 రూపాయలు అందించారు. ఎన్నికల సందర్భంగా తన వార్డులో వివాహం జరిగే ఆడపిల్ల పెళ్లికి కానుకగా 10,116 రూపాయలు అందిస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన తేజస్విని వివాహానికి వెళ్లి తన కానుకగా డబ్బులు అందించారు. కౌన్సిలర్ మనోజ్ ను పెళ్లి కుమార్తె తల్లిదండ్రులతో పాటు పలువురు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు అభినందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మనోజ్ మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తాను ఆడపిల్లకు కానుక అందించానని, వార్డు సమస్యల పరిష్కారం కృషి చేస్తానని, అభివృద్ధి కోసం అందరి సలహా సూచనలతో ముందుకు వెళ్తానని అన్నారు.









