
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
ఓసిల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23న డిల్లీలో జాతీయ స్థాయి ఓసిల మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తెలిపారు. ఈ మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 23న నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి ఓసి ల మహా ధర్నాకు మద్దతు తెలపాలని గురువారం జగిత్యాల శాసన సభ్యుడు డాక్టర్ ఎం.సంజయ్ కుమార్ ను ఓసి జేఏసీ జిల్లా కన్వీనర్ మహంకాళి రాజన్న, రెడ్డి సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డిలతో జగిత్యాలలోని ఆయన నివాసంలో పోలాడి రామారావు కలిసి ఏంఎల్ఏ సంజయను కోరుతూ గురువారం డిమాండ్లతో కూడిన ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ అగ్రవర్ణాల్లోని ఆర్ధికంగావెనుక బడి ఉన్నవారు రిజర్వేషన్లు లేమి కారణంగా అటు సంక్షేమ పథకాలఫలాలు ఇటు రాజకీయ పదవులు పొందలేక పోతున్నారని అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలతో మున్సిపల్ వార్డు రిజర్వేషన్లలో ఓసిలకు తీవ్ర అన్యాయం జరిగి అవకాశాలు కోల్పోయారని మండిపడ్డారు. ఇదే తప్పులను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పునరావృతం కాకుండా రాజకీయ ఒత్తిళ్ళకు అధికారులు తలొగ్గకుండా శాస్త్రీయలో 2011జనాభా ప్రాతి పదికన రిజర్వేషన్లు కల్పించాలని రామారావు డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పై రాజకీయ పబ్బం కోసం కొందరు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద ఓసి లు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జనరల్ స్థానాల్లో సైతం ఓసిలు తట్టుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. జనరల్ స్థానాల్లో కూడా ఓసిలకు రాజకీయ పార్టీలు అవకాశం ఇవ్వక పోవడం వల్ల రాజకీయంగానూ వెనుక బడి పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వారికి చేయూత నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తే వాటిపైనా దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పటిష్టంగా అమలు చేసేందుకు జాతీయస్థాయి ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు ఐకాస నాయకులు పాల్గొన్నారు.

ఏంఎల్ఏ సంజయను ఆహ్వానిస్తున్న పోలాడి రామారావు





