
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ ఇంటర్ మరియు డిగ్రీ కళాశాల గ్రౌండ్‌కు చెందిన విలువైన ప్రభుత్వ భూమిని భూ కబ్జాల నుండి రక్షించాలని బీజేపీ హుజూరాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ వద్ద నిరసన వ్యక్తం చేసి ఆర్డిఓ జల కుమారికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేలాది మంది విద్యార్థులు క్రీడా కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్న కళాశాల గ్రౌండ్ ఇటీవల కొందరు వ్యక్తుల కబ్జా ప్రయత్నాలకు గురవుతున్నట్లు ప్రజలు మరియు విద్యార్థుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కళాశాలలకు సెలవులు ఉన్న సమయంలో జేసీబీలతో భూమిని చదును చేయడం ద్వారా ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించడం అత్యంత ఆందోళనకరమని అన్నారు.
ఈ నేపథ్యంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) కి వినతిపత్రం సమర్పించి, కళాశాల గ్రౌండ్‌కు వెంటనే అధికారిక సర్వే నిర్వహించి స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేయాలని, గ్రౌండ్ చుట్టూ శాశ్వత ప్రహరీ గోడ నిర్మించాలని, కబ్జాకు ప్రయత్నించిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి అని, వాటిని పరిరక్షించడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థుల క్రీడా అవసరాలు మరియు భవిష్యత్ తరాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణఅధ్యక్షులు తూర్పాటిరాజు జిల్లాకౌన్సిల్ మెంబర్ రావులవేణు పట్టణ మాజీఅధ్యక్షులు గంగిశెట్టిరాజు సీనియర్ సెంట్రల్ ఫిలిం బోర్డుమెంబర్ సబ్బనిరమేష్ నాయకులు యాంసానిశశిధర్ నరాలరాజశేఖర్ తిప్పబతినిరాజు యాళ్లసంజీవరెడ్డి అంకటివాసు బోరగాలసారయ్య కొడిమ్యాలపవన్ కొలిపాక వెంకటేష్ పడారిసుమన్ కొలుగూరిఅనిల్ మోటపోతుల రాకేష్ క్యాస వెంకటేష్ డోరిఐలయ్య పర్ధంవిజయ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు





