
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోనీ జాతీయ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గం మహిళా జనరల్ సెక్రటరీగా పట్టణానికి చెందిన దేవసాని ప్రియదర్శిని నియమించారు. బీసీ జెఏసి ఉద్యోగ సంఘాల అధ్యక్షులు నీలం వెంకటేశం, విద్యార్థి స్టేట్ లీడర్ రాందేవ్, కరీంనగర్, పెద్దపల్లి ఉమ్మడి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిలు యాదవ్ ల ఆధ్వర్యంలో నియమించడం జరిగిందన్నారు. కాగా ఆమె నియామకం పట్ల హుజురాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్న, గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, సీనియర్ నాయకులు ఆలేటి రవీందర్, ఆకుల సదానందం, ఎర్రబోజ్జ నారాయణ, బండారి శ్రీనివాస్, ఉప్పు శ్రీనివాస్, చిలుకమారి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఇప్ప కాయల సాగర్, కోశాధికారి ఇప్పలపల్లి చంద్రశేఖర్, మహాత్మా జ్యోతిబాపూలే ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు బుర్ర కుమార్ గౌడ్, తాళ్లపెళ్లి అమరేందర్ గౌడ్, సురేందర్, బిక్షపతి, కుమార్ యాదవ్, గరవేణి శ్రీకాంత్, కొలిపాక క్రాంతి, మామునూరి ప్రవీణ్, నడిగోటి రమేష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

జాతీయ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గం మహిళ జనరల్ సెక్రెటరీగా దేవసాని ప్రియదర్శినికి నియామక పత్రం అందజేస్తున్న ఆర్ కృష్ణయ్య..

ఆర్ కృష్ణయ్యను సత్కరిస్తున్న ప్రియదర్శిని..





