
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: 2026- 27 విద్యా సంవత్సరానికి గాను సోమవారం పాఠశాలలు పున: ప్రారంభమయ్యాయి. వాస్తవానికి జూన్ 12న ప్రారంభం కావాల్సిన పాఠశాలలు ప్రభుత్వం మరో మూడు రోజులు సెలవులు తొలగించడంతో 15న ప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు అన్ని విద్యా సంవత్సరంలో ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లో తగిన ఏర్పాట్లు చేశారు. పలు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు మామిడి తోరణాలు కట్టి మైదానాల్లో రంగురంగుల ముగ్గులు వేశారు. మరికొంత మంది ఉపాధ్యాయులు రంగురంగుల బెలూన్లను పాఠశాల గేట్ల వద్ద ఏర్పాటు చేసి పిల్లలకు స్వాగతం పలుకారు. పాఠశాలకు వచ్చిన పిల్లలకు ఉపాధ్యాయులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. పాఠశాల ప్రారంభం రోజున పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు హుజురాబాద్ ఎంఈఓ విడపు శ్రీనివాస్ పాఠ్యపుస్తకాలను నోటుపు స్తకాలను అందించారు. పలు పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధికి తాము తీసుకుంటున్న చర్యల గురించి వారు వివరించారు. హుజురాబాద్ మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పంపిణీ చేయడానికి సుమారు 20వేల పాఠ్య పుస్తకాలు, సుమారు 14 వేల నోటు పుస్తకాలు జిల్లా విద్యాశాఖ మండల కేంద్రానికి పంపించగా వాటిని ఎంఈఓ శ్రీనివాస్ బడిబాట కార్యక్రమం ముందుగానే పాఠశాలల్లో చేరే విధంగా చర్యలు తీసుకున్నారు.



అందంగా అలంకరించిన పాఠశాలలకు ఉత్సాహంగా వస్తున్న విద్యార్థులు

—అమావాస్యత తగ్గిన హాజరు
సోమవారం విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు ద్వారాలు తెలిసినప్పటికీ సోమవారం అమావాస్య తిథి కావడంతో పిల్లలను పాఠశాలకు పంపడానికి తల్లిదండ్రులు సుముఖంగా లేకపోవడంతో హాజరు శాతం తగ్గింది. పలు పాఠశాలల బస్సులు ఖాళీగా తిరిగి వచ్చాయి. రెండవ రోజు మంగళవారం కావడంతో పాఠశాలకు తమ పిల్లలను పంపమని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు నేరుగా చెప్తున్నారు. దీంతో బుధవారం మాత్రమే పాఠశాలలకు పిల్లలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రారంభం అయ్యే పాఠశాలలను మూడు రోజుల సెలవిచ్చి అమావాస్య రోజు ప్రారంభించడం పట్ల పలువురు తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. పిల్లల హాజరు తక్కువగా ఉండడంతో పాఠశాలలన్నీ బోసిపోయాయి. రెండవ రోజు కూడా ఇది పరిస్థితి దర్శనం ఇచ్చే అవకాశం కనబడుతుంది.

మొదటి రోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందజేస్తున్న ఎంఈఓ విడపు శ్రీనివాస్

మొదటిరోజు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు వివరిస్తున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు





