Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై కాంగ్రెస్ నాయకులు సంపత్ అనిచిత వ్యాఖ్యలు చేయడంను నిరసిస్తూ సోమవారం బిఆర్ఎస్ నాయకులు హుజురాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తిప్పారపు సంపత్ తన పేరు కోసం ఎవరిపై పడితే వారిపై ఆరోపణలు చేయడం అలవాటని అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదని, ప్రజాసేవ చేస్తున్న హరీష్ రావుపై విమర్శలు చేయడం ఆరోపణలు చేయడం తగదనీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మారెపల్లి సుశీల, ముక్క రమేష్, బర్మా వత్ యాదగిరి నాయక్, అక్కినపల్లి శిరీష, నాయకులు కొండ్ర నరేష్, విడపు అనురాగ్, తలకొక్కుల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ కు సంపత్ ఫై ఫిర్యాదు చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు..





