
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్( ఎల్కతుర్తి):గతకొద్దిరోజులుగా హుజురాబాద్ ప్రాంతంలో బైకు దొంగతనాలకు పాల్పడుతూ వాహన యజమానులకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన… బైక్ దొంగల ఆట కట్టించారు హనుమకొండ జిల్లా ఎలుకతుర్తి పోలీసులు.
ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలను వెల్లడించారు. హుజురాబాద్, జమ్మికుంట, ఎలుకతుర్తి ప్రాంతాలలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసి, వీరి నుండి ఆరు చోరీ చేసిన బైక్లను స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఈ నిందితులలో ముగ్గురు మైనర్లు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు.


వివరాలు వెల్లడిస్తున్న సీఐ, ఎస్ఐ..





