
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ నెల 18వ తేదీ నుండి పవిత్ర రంజాన్ మాసం మొదలైనందున హుజురాబాద్ లోని అన్ని మసీదుల వద్ద తగు సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసిని, కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ కు కలిసి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు జామే మస్జిద్ కమిటీ సభ్యులు వినతి పత్రాలు అందజేసారు. పచ్చిగడ్డి, తుమ్మ చెట్లు ఇతర రకాల చెట్లను క్లీనింగ్ చేయుటకు అలాగే మసీదుల వద్ద విధి దీపాలు (లైట్స్) అమర్చుటకు, బ్లీచింగ్ పౌడర్ చల్లటం రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు మసీదులలో జరుగు సందర్భముగా మున్సిపల్ కార్యాలయం ద్వారా ప్రతిరోజు నీటి సౌకర్యం టాక్టర్ ద్వారా నీటి వసంతి కల్పించడం మరియు ఇతర సౌకర్యాలు కల్పించాలని శుక్రవారం నమాజు తర్వాత హుజురాబాద్ జామే మసీద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మొహమ్మద్ రఫీ మున్ను మొహమ్మద్ హబీబ్ మహమ్మద్ ఫయాజ్ జమీల్ అహ్మద్ మహమ్మద్ ఖాన్ జామి మజీద్ ఇమామ్ మొహమ్మద్ షాకీర్ నాయబ్ ఇమామ్ మొహమ్మద్ అబ్దుల్ ఫహీమ్ లు మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ లను కలిసి జామే మసీద్ కమిటీ తరఫున వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ చుట్టూ ఎలాంటి చిరు వ్యాపారం బండ్లు కూరగాయల వ్యాపారాలు లేకుండా నమాజు వేళములో ఇబ్బంది కలిగిస్తున్నందున వారిని రంజాన్ ఉపవాసం మాసం అయిపోయే వరకు వేరే ప్రాంతంలో వ్యాపారాన్ని చేసుకున్నలా అనుమతి ఇచ్చి మాకు ఇబ్బంది లేకుండా చూడగలరని రంజాన్ మాసం మొదలు సందర్భంగా ముస్లింలు వారి వారి మరణించిన బంధువుల సమాధులను సందర్శిస్తుంటారన్నారు. ఈద్గా కబ్రిస్తాన్ ప్రాగణములో పెరిగిన పిచ్చి చెట్లు, గడ్డిని మున్సిపల్ కార్మికులచే క్లీనింగ్ చేయుటకు బ్లేడ్ టాక్టర్ ద్వారా గడ్డిని క్లీన్ చేయుటకు కొరకు రంజాన్ పండుగ రోజు నమాజ్ సందర్భంగా పెండల్స్ సౌండ్స్ సిస్టం, త్రాగునీటి సదుపాయం కల్పించాలని, ఈద్గా చుట్టూ కలరింగ్ అలాగే అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని, కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ కు కలిసి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు జామే మస్జిద్ కమిటీ సభ్యులు వినతి పత్రాలు అందజేసినట్లు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, కమిటీ సభ్యులు తెలిపారు.


రంజాన్ పండుగకు సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసిని కి వినతి పత్రం అందజేస్తున్న ముజాహిద్, కమిటీ సభ్యులు..

కమిషనర్ ఎస్డి ముసబ్ అహ్మద్ కు వినతి పత్రం అందజేస్తున్న ముజాహద్ హుస్సేన్, కమిటీ సభ్యులు..





