
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు సోమవారం శాతవాహన యూనివర్సిటీ అధికారులు విడుదల చేసిన డిగ్రీ మొదటి సెమిస్టరు పరీక్ష ఫలితాలలో యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు.
అత్యుత్తమ ఫలితాలు సాధించిన వారిలో ఎండి షబానా ఎంపీసీఎస్ (9.28), అయిలబోయిన పూజిత బీకాం (8.64), అన్నోజు చందన ఎంపీసీఎస్ (8.88), బాణాల వైష్ణవి బీకాం ( 8.44), తంగేళ్ల వైష్ణవి బీకాం (8.44), తమ్మలి శ్వేత బీకాం (8.32), ఎడ్ల సిరి బి జెడ్ సి (8.32), పర్లపెల్లి అమృత వర్షిని బీ జెడ్ సి (8.32),
మరుపాక మౌనిక ఎంపీసీఎస్ (8.16) ఉన్నారు.
అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఉద్దేశించి కళాశాల కరెస్పాండంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు కళాశాల స్థాయిలోనే కాకుండా యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం చాలా గర్వకారణం అని, మున్ముందు కూడా ఇలాంటి ఫలితాలు ఎన్నెనో సాధించాలని సూచించారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల కరెస్పాండంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ బొక్కల ప్రవీణ్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు కొలిపాక రమేష్, బోరాగాల సంపత్, మేకల నవీన్, రామరాపు భద్రయ్య, సురేష్, వెంకటేష్, శ్రీనివాస్, స్వప్న, ప్రియాంక లు అభినందించారు.

యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు..

యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పూల బొకేలు ఇచ్చి, శాలువాలు కప్పి అభినందిస్తున్న కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు..





