
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ….ఉమ్మడి రాష్ట్రంలో దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసం 14 సంవత్సరాల పాటు అహింసా మార్గంలో పోరాటం చేసి అన్ని పార్టీలతో తెలంగాణకు మద్దతుగా మాట్లాడే విధంగా చేశాడన్నారు. కెసిఆర్ కృషితో, ఎందరో బలిదానాలు నరేందర్ త్యాగాల ఫలితంగా తెలంగాణ సిద్ధించిందని, సిద్ధించిన తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే లక్ష్యంగా సంవత్సరాలు కెసిఆర్ రాష్ట్రాన్ని పరిపాలించాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఇచ్చిన వాగ్దానాల అమలు పరచడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. అందుకే ప్రజలు తిరిగి కెసిఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. బిఆర్ఎస్ కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి అన్నారు. కెసిఆర్ మరెన్నో జన్మదిన వేడుకలు నిర్వహించు కోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు గందె శ్రీనివాస్, వర్దినేని రవీందర్ రావు, ప్రతాప మంజుల, కేసిరెడ్డి లావణ్య బండ సింధుజ, మాజీ కౌన్సిలర్లు మారేపల్లి సుశీల, ముత్యంరాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్, నాయకులు ధనవర్ష రాజు, గఫార్, సమ్మయ్య, సబ్బని రమేష్, లక్ష్మణామూర్తి తదితరులు పాల్గొన్నారు.

—బిఆర్ఎస్ వై ఆధ్వర్యంలో….
మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ వై ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ వై నియోజకవర్గ ఇంచార్జి తొగరు శివకృష్ణ బిఆర్ ఎస్ సీనియర్ నాయకులు తొగరు బిక్షపతి,
బిసి ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలుకమారి శ్రీనివాస్, సందెల వెంకన్న, mm సాగర్, మామునూరి ప్రవీణ్, తాళ్ళపెల్లి రాజేష్, క్రాంతికుమార్, రవీందర్, ఉపసర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు వన్నాల శివాజీ, యూత్ నాయకులు ప్రణయ్, రాజు కుమార్, సంతోష్, మహేందర్, ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు..







