Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హనుమకొండ: ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావును రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండలో సోమవారం ఓసి ఐకాస కార్యాలయ సమీపంలోని ఆంజనేయుడి దేవాలయంలో నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈనెల 23న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ఓసిల స్థితి గతులు అధ్యయనానికి జాతీయ స్థాయిలో ప్రత్యేక ఓసి కమిషన్ ఏర్పాటు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించటానికి, రైతు భాగస్వామ్యంతో ప్రత్యేక చట్టం తేవాలనే తదితరుల డిమాండ్లతో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో దేశరాజధాని డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద జాతీయ స్థాయిలో నిర్వహించ తలపెట్టిన ఓసిల మహాధర్నా విజయవంతానికి వివిధ రాష్ట్రాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అవిశ్రాంతంగా సుడి గాలి పర్యటనలు చేస్తూ దేశవ్యాప్తంగా, పార్టీల కతీతంగా మద్దతు కూడగడుతో అహర్నిశలు శ్రమించిన పోలాడి రామారావుకు రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆంజనేయుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రాల ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందించి ఘనంగా సన్మానించారు. ఇందుకు ఓసిల, రైతుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తనకు ఒక ప్రత్యేక ప్రేరణ కలిగించించి మరింత బాధ్యత పెంచిందని నాయకులతో సమన్వయం చేస్తూ రైతులను, ఓసి యేతరులను సైతం కలుపుకొని మరింత ఉత్సాహంగా పని చేస్తానని తెలుపుతూ రైతు ప్రజాసంఘాల సమాఖ్య, ఓసి జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆంజనేయుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల మంత్రాల ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందించి ఘనంగా సన్మానిస్తున్న దృశ్యం.





