
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పరిసర ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని కోరుతూ డంపింగ్ యార్డ్ వ్యతిరేక అఖిలపక్ష కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలు సోమవారం 29వ రోజుకు చేరాయి. ఆరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టి తాసిల్దారుకు వినతిపత్రం అందజేశారు. డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని, పర్యావరణం కూడా దెబ్బతింటుందని ప్రజల కష్టాలను గమనించి ప్రభుత్వం డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ నిరసన దీక్షలో సంఘ అధ్యక్షులు మిరియల్కార్ చందాజీ, నాయకులు కోయల్‌కార్ బాలాజీ, కోయల్ కార్ దుర్గాజి, శ్రీనివాస్, గోవికార్ సమ్మాజి, రామోజీ, శ్రీనివాస్, జమాల్పూర్ సంతోష్, తుక్కాజి, రమేష్ ,అనిల్, హనుమాన్ రవి, సాయి, రావులకారీ యాదగిరి, నవీన్, నగేష్, నాగరాజు, ప్రభురాజ్, శ్రీనివాస్, ప్రశాంత్, కోయల్ కార్ శ్రీకాంత్, పవన, శ్రీను, నీలిమ, అఖిలపక్ష నాయకులు వేల్పుల రత్నం, ఎడవల్లి కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నిరసన దీక్షలో కూర్చున్న ఆరె కటిక సంఘం నాయకులు, సభ్యులు






