
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కార్మికుల సంక్షేమ పథకాలపై కార్మికులకు కనీస అవగాహన అవసరం అని ఉమ్మడి జిల్లా ఉప కార్మిక కమిషనర్ కోల ప్రసాద్ చెప్పారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో మే డే వారోత్సవాల్లో భాగంగా ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా కార్మికులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…

రాష్ట్రంలో వివిధ రకాల కార్మికులు ఉంటారని వారందరి ప్రయోజనం కోసం అనేక పథకాలు ప్రభుత్వాలు రూపొందించాయన్నారు. ఈ పథకాల వల్ల ప్రయోజనాలు ఎవరు పొందుతారు ఎవరికి ప్రయోజనం అనే విషయాలు చాలామందికి తెలియకపోవడం వల్ల వారు వినియోగించు కోలేకపోతున్నారని చెప్పారు. కార్మికులు లేబర్ కార్డు తీసుకోవడం ఒకటే కాకుండా అది ఎన్ని రోజుల్లో రెన్యువల్ చేసుకోవాలి, రెన్యువల్ చేసుకోలేనప్పుడు దాని వల్ల ప్రయోజనాలు రావన్న విషయాన్ని కార్మికులకు తెలియజేయడం అధికారులతో పాటు కార్మిక సంఘ నాయకులకు బాధ్యత ఉంటుందని అన్నారు. కార్మికులు ఎవరైనా తమ ప్రయోజనాల కోసం ముందస్తుగా కార్మిక శాఖ కార్యాలయంలో అధికారులను సంప్రదించాలని కోరారు. మధ్యవర్తులు కాకుండా తామే నేరుగా తమ ప్రయోజనాల కోసం రావాలని కోరారు. కార్మిక సంఘ నాయకులు సైతం కార్మికులకు వచ్చే ప్రయోజనాలను వివరించాలని చెప్పారు.

ఈ సమావేశంలో హుజురాబాద్ ఇన్చార్జి కార్మిక శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు కోయల్ కార్ బాలాజీ, సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్, వివిధ కార్మిక సంఘాల నాయకులు పిట్టల సమ్మయ్య, కదిరే రమేష్, సబ్బని తిరుపతి, పళ్ళ తిరుపతి, పుల్లూరు యాదగిరి ఇమ్మడి చక్రపాణి మోరే రవి, ఇజ్జిగిరి సుధాకర్, సంగేమ్ వెంకటస్వామి, అంబాల సమ్మయ్య, ఎంజాల వాసు, రేణుకుట్ల సారయ్య, జమ్ముకం వెంకన్న, రేగుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.


అవగాహన సదస్సుకు హాజరైన వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు..





