Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నిజాలను నిర్భయంగా ప్రశ్నిస్తే దాడులు చేస్తారా..!? వాస్తవాన్ని మాట్లాడిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంను అపహస్యం చేసినట్లేనని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బండ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో విమర్శలు చేస్తే ప్రతి విమర్శ చేయాలి తప్ప దాడులు చేయడమేమిటని, దాడులు మన సంస్కృతి కాదని బండ శ్రీనివాస్ అన్నారు. గురువారం హుజురాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆయన నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ ఉందని, విమర్శ చేశారని వాహనాలపై దాడి చేయడం కార్యాలయాల పై దాడి చేయడం దాడుల సంస్కృతికి బిజెపి ఆజ్యం పోసిందన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ ఇష్టం వచ్చిన రీతిలో విమర్శలు చేయడం ఆయన సంస్కారానికి చెల్లిందన్నారు. దానికి సమాధానంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇలా అంటే మీకు ఎంత బాధ అని చెప్పడం జరిగిందన్నారు. విమర్శ చేస్తే దాడులు చేయడం ఎక్కడికి దారితీస్తుంది అన్నారు. బిఆర్ఎస్ కార్యకర్తల బలం కూడా పెద్దదేనని మరి తాము కూడా దాడులకు దిగితే బిజెపి నాయకులు తట్టుకోగలరని ఆయన అన్నారు. కానీ తాము దాడులకు దిగకుండా శాంతి యుతంగా ఇది తప్పు అని చెప్పడం జరుగుతుందని మార్చుకోకపోతే మాత్రం మరోసారి గులాబీ సైన్యం సత్తా చూపుతుందన్నారు. మాజీ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణ రావు మాట్లాడుతూ…. కరీంనగర్ లో జరిగిన దోపిడీ గురించి దిగజారుతున్న శాంతి భద్రతల గురించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడితే దానికి సమాధానం కాంగ్రెస్ వారు చెప్పాలి కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పడం ఏమిటి దానిలో కేటీఆర్ ను ఆయన కుటుంబాన్ని విమర్శించడం ఏమిటని అన్నారు అలాంటప్పుడు దానికి సమాధానం కౌశిక్ రెడ్డి చెప్తే తప్పెలా అవుతుందని అన్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ తమ గుండాల ద్వారా దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగురి దిలీప్ కుమార్ మాట్లాడుతూ…. క్రమశిక్షణ కలిగిన గులాబీ సైన్యం ఇప్పటివరకు బిజెపి గుండాలు చేసిన దాడిని కేవలం ఖండిస్తున్నామని మరోసారి గులాబీ అధినేతలపై అవాకులు, చేవాకులు మాట్లాడితే సహించేది లేదన్నారు. సింగిల్ విండో చైర్మన్ కొండల్ రెడ్డి మాట్లాడుతూ… బిజెపి గుండాల దాడులను తాము ఖండిస్తున్నామని అన్నారు. దమ్ముంటే సమాధానం చెప్పాలి గాని దాడులు సరైన పద్ధతి కాదన్నారు. బిజెపి గుండాలు చేస్తున్న పిచ్చి చేష్టలను గులాబీ సైన్యం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, తక్కల్లపెళ్లి సత్యనారాయణరావు, వెంకటేష్, కట్కూరి మల్లారెడ్డి, ముసిపట్ల తిరుపతిరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, ములుగు పూర్ణ చందర్, మండల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమస్యలు మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్..





