
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపల్ పరిధిలో తీవ్రంగా ఉన్న కోతుల బాధ తొలగించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని స్పష్టం చేశారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో కోతులను పట్టే వారితో బోనులలో కోతులను పట్టించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటీవల హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కోతుల దాడిలో పలువురు గాయపడ్డారని అన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర నుండి కోతులను పట్టి వ్యక్తులను పిలిపించి పట్టణంలో గత నాలుగు రోజులుగా కోతులను పట్టిస్తూ భూపాలపల్లి అడవులకు పంపిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ బి కిరణ్, సిబ్బంది ప్రతాప రాజు, రోంటాల సుధీర్, తూముల కుమారస్వామి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.





కోతులు పట్టడాన్నీ పరిశీలించి మాట్లాడుతున్న మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని





