
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: దాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని తీవ్ర జాప్యం చేస్తూ రైతులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని రైతు సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు. గురువారం ఆయన శంకరపట్నం మండలంలోని తాడికల్, ఏరడపల్లి, ముత్తారం, మెట్పల్లి, ఆముదాలపల్లి గ్రామాలతో పాటు హుజురాబాద్ మండలంలోని బోర్నపల్లి, సింగాపూర్, తదితర గ్రామాల్లో రైతు సంఘం నాయకులతో కలిసి దాన్యపు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకున్నారు. కేంద్రాలకు వరి, మక్కల దాన్యం తెచ్చి 20 రోజులు దాటినా కొనే పరిస్థితి లేదన్నారు. ఇటీవల కురిసిన వర్షం తో దాన్యం తడిసిందన్నారు. కొన్ని చోట్ల గన్ని బ్యాగులు ఇవ్వడం లేదని, తూకం వేసిన వడ్లను మిల్లులకు తరలించేందుకు వాహనాలు రావడం లేదన్నారు. ఏ గ్రేడ్ దాన్యాన్ని కూడా మిల్లర్లు కామన్ రకం కిందనే దించుకుంటామని, హమాళీలు లేరని మెలిక పెడుతున్నారన్నారు క్వింటాల్ కు 5కిలోలు తరుగు పేరిట దోపిడీ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదాన్నారు. అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేసి మిల్లర్ల దోపిడీని నివారించాలన్నారు. తడిసిన దాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేలా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 30న కరీంనగర్ లో రెండు లక్షల మందితో రైతుల మాహాగర్జన సభ ఏర్పాటు చేయనున్నట్లు పోలాడి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రజా సంఘాల జేఏసీ ఉత్తర తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు పెండ్యాల రాం రెడ్డి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఏనుగు చొక్కా రెడ్డి. పాంద్రాల శ్రీనివాస్,వేముల రఘు,రవీందర్ రావు,సంపత్ పాల్గొన్నారు.

తాడికల్ లో మాట్లాడుతున్న రైతు ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు






