
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ మే 8: ఈనెల 10వ తారీఖున హైదరాబాదు లోని పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న బహిరంగ సభకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నందున బహిరంగ సభను విజయవంతం చేయడం కోసము హుజురాబాద్ పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో ప్రచారంలో భాగంగా పట్టణములో ప్రధానమైన వీధుల వెంట గోడలపై మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని గోడలపై రాతలతో ప్రచారాన్ని నిర్వహించారు.





