
–కరీంనగర్ బంద్ పిలుపు దేనికి సంకేతం..
–కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ లో మొఖం లేక కరీంనగర్ వెళ్ళాడు, తన రాజకీయం కోసం ఎవరినైనా బలి చేస్తాడు.
–కెటిఆర్ ఫ్రస్టేషన్ లో ఉన్నాడు, అధికార దాహం కోసం ముఖ్యమంత్రిపై విమర్శలు.
–బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడిన హుజురాబాద్ ఇంచార్జ్ వొడితల ప్రణవ్..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు లోలోపల ఒప్పందం కుదుర్చుకొని పైకి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నట్టు నటించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడతల ప్రణవ్ విమర్శించారు.శనివారం నాడు హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ బంద్ కు బిఆర్ఎస్ నాయకులు పిలునివ్వడం దేనికి సంకేతమని, ప్రజల కష్టాలు తీర్చడానికి ఈ బంద్ ఆ లేక వ్యక్తిగత బలప్రదర్శన చూపెట్టడానికి, చిల్లర రాజకీయం చేయడానికి ఈ బంద్ చేస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తెలపాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో సహేతుక విమర్శలు ఉండాలి కానీ వ్యక్తిగత విషయాలు, విమర్శలు చేయడం మంచిది కాదని,మొదటినుండి చెప్తున్నట్లు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ దొందు దొందే అని పైకి కొట్లాడినట్టు నటించినా లోపలికి ఒక్కటే అని అన్నారు. పీఎంజె షాపులో బాధితులకు న్యాయం చేస్తామని, అలాగే నిందితులను అతి త్వరలో పట్టుకుంటామని పోలీసులు విచారణ చేపట్టి, తమ విధి నిర్వహణ వారు చేస్తున్నారని అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే, హోంశాఖ మంత్రిగా ఉండడం ఈ కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా మాట్లాడడం మంచిది కాదని, దొంగతనాన్ని కూడా రాజకీయం కోసం వాడుకోవడం ఎంత వరకు సబబు అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో రీల్స్ మీద ఉన్న ధ్యాస ప్రజల సమస్యల మీద కౌశిక్ రెడ్డికి లేదని, వావిలాల సమీపంలో అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులను పరామర్శించే సమయంలో లేదా అని మండిపడ్డారు.

కరీంనగర్ జిల్లా ప్రశాంతంగా ఉంది..ఎలాంటి ఆందోళన లేదు…
బాధ్యతాయుత పదవిలో ఉన్న కేంద్ర హోం మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి తప్ప, కరీంనగర్ జిల్లాలో ఏదో జరుగుతుంది అన్నట్టు సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం సబబుకాదన్నారు. అలాంటిది ఏం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో నేర నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. కౌశిక్ రెడ్డికి పోలీసు వాహనాలను ముందు వెనకాల ఉంచుకోవాలనే సోకు ఉందని అందుకే ఇలా హైలెట్ కావాలని లేనివి ఉన్నట్టుగా కల్పిస్తున్నాడని అన్నారు. హుజురాబాద్ లో మొఖం లేక కరీంనగర్ వెళ్ళి అక్కడ చిల్లర రాజకీయ వేషాలు వేస్తున్నాడని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హుజురాబాద్ ఎమ్మెల్యే అంటే ఛి ఛీ అనే స్థాయికి తీసుకొచ్చాడనీ, కౌశిక్ ఎమ్మేల్యే అయి ప్రజలను పీడించడం తప్ప ప్రజలకు చేసింది ఏం లేదని మండిపడ్డారు.

కేటీఆర్ కు అధికార దాహం పెరిగింది…
వరంగల్ లో జరిగిన బీఆర్ఎస్ రైతుల సమావేశంలో కాంగ్రెస్ పై విమర్శలు చూస్తుంటే కేటీఆర్ లో అధికార దాహం స్పష్టంగా కనిపిస్తుందని, ఎంత ఫ్రస్టేషన్ ఉందో అర్థం అవుతుందని, బహుశా కౌశిక్ రెడ్డి గాలి కేటీఆర్ కు కూడా సోకినట్టుందని అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. కేటీఆర్ మాట్లాడిన మాటలను హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన బేషరతుగా ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా రైతు ప్రభుత్వమని అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోపే రుణమాఫీ చేశామని పదేళ్లలో వారు చేయలేని రుణమాఫీ ఒకే సంవత్సరంలో 22,000/- వేల కోట్ల చేశామని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వరి వేస్తే ఉరి అని ఆనాడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నవడ్లు పండిస్తే క్వింటాకి 500 రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకున్నామని, సన్నబియ్యం ఇస్తున్నామని, రైతు భరోసా ద్వారా రైతులను ఆదుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, డైరెక్టర్లు, ఉప అధ్యక్షులు, జిల్లా అధికార ప్రతినిదులు, మండల, పట్టణ అధ్యక్షులు, మహిళ అధ్యకురాల్లు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నేత ప్రణవ్ బాబు





