
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : హైదరాబాద్ కొంపల్లికి చెందిన ఓ కుటుంబం రూ. 5 కోట్ల కోసం నన్ను బ్లాక్మెయిల్ చేస్తోందని, తన స్నేహితుల ద్వారా ఓ అమ్మాయి పరిచయం అయ్యిందని ఆమెతో ఆలయాలు, పార్టీలకూ వెళ్లామన్న బగీరథ్ తెలిపారు. నా.. మెసేజ్లు, వీడియోలని ఉపయోగించి ఇప్పుడు వాళ్లు బ్లాక్మెయిల్ చేస్తున్నారని బండి బగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, లేదంటే రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారన్న బండి బగీరథ్. ఇప్పటికే తాను రూ.50 వేలు ఇచ్చానని.. ఇంకా డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్న బగీరథ్. నేను అమాయకుడ్ని, నన్ను కాపాడండి అంటూ పోలీసులను వేడుకొంటున్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ.





