
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పట్టపగలు ఓ ఇంట్లో ఐదుగురు మహిళలు చొరబడి ఇంట్లోని విలువైన వస్తువులను దొంగిలించడం కలకలం రేపుతోంది. మహిళలు చోరీ చేసి వెంట తీసుకు వెళున్న దృశ్యాలు సిసి కెమెరాలు రికార్డు కాగా బాధితులు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఇందిరా నగర్ 12వ వార్డుకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సూరంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో నిన్న మిట్ట మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేనిది చూసి అయిదుగురు మహిళలు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలను తెరచి దానిలో వెతికి ఎలాంటి బంగారం, వెండి, నగదు దొరకక పోవడంతో సజ్జలపై కూతురు వివాహానికి కొని సంచిలో దాసి ఉంచిన రాగి, ఇత్తడి, దేవుడి పటాల వద్ద ఉన్న వెండి వస్తువులను దొంగిలించి రెండు బస్తాలలో నింపుకొని పట్టుకొని వెళ్లడం పలువురిని భయాందోళనకు గురిచేస్తుంది. శ్రీనివాస్ వృత్తిరీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తుండగా ఇటీవల జనాభా లెక్కల విధులు నిర్వహిస్తూ భార్య పిల్లలతో అక్కడే ఉంటున్నాడు. సెలవు దినాలలో మాత్రమే సొంత ఇంటికి వచ్చేవాడు. అయితే ఇంట్లో రాగి, ఇత్తడి, వెండి వస్తువులను భద్రపరచుకొని ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయారు. నిన్న ఐదుగురు మహిళలు పాత ఇనుప సామాను ఏరుకునే వారి వేషంలో వచ్చి ముగ్గురు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడగా ఇద్దరు మహిళలు బయట కావలిగా కూర్చోవడం సీసీ కెమెరాలో రికార్డు అయింది. సాయంత్రం ఇరుగుపొరుగువారు ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గుర్తించి బాధితునికి సమాచారం ఇవ్వగా శ్రీనివాస్ ఈరోజు శనివారం ఉదయం వచ్చి ఇంట్లో తెరిచి ఉన్న బీరువాలను సజ్జలపై దాచి ఉంచిన రాగి ఇత్తడి వస్తువులను వెతకగా కనిపించకపోవడంతో హుజురాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు ఎత్తుకు పోయిన రాగి, ఇత్తడి, వెండి వస్తువుల విలువ సుమారు 20వేలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొనగా వాస్తవానికి రూ.50 వేలకు పైగా ఉంటుందని బాధితులు మీడియాకు తెలిపారు. పట్ట పగలు ఐదుగురు మహిళలు యదేచ్చగా ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి మూడు సంచుల్లో విలువైన వస్తువులను నింపుకొని తీసుకువెళ్లడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. నిత్యం గుర్తుతెలియని వారు ఆ వాడలో సంచరిస్తున్నారని, కుక్కలు అరిస్తే వాటిని కొట్టి మరి వెళ్తున్నారని స్థానికులు తెలిపారు. అలాగే పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద, బస్టాండ్ వద్ద పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు యదేచ్ఛగా దొంగలించి తీసుకువెళ్లడం సీసీ కెమెరాలు పడడం గమనిస్తే పట్టణంలో చోరీలు యదేచ్చగా సాగుతున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి చోరీలను అరికట్టి దొంగలను పట్టుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


ఒకరేణుక ఒకరు ఇంట్లోకి చొరబడుతున్న మహిళ దొంగలు

చోరీ అయిన ఇల్లు ఇదే..

కూతురు పెళ్లికి కొని సజ్జలపై దాచిపెట్టిన రాగి, ఇత్తడి, వెండి వస్తువులు ఎత్తుకెళ్లిన చోటు ఇదే..


ఒకరేణుక ఒకరు ముగ్గురు మహిళలు సంచుల్లో రాగి ఇత్తడి వస్తువులను తీసుకెళ్తున్న దొంగలు.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు.





