
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జూన్ 1: హుజూరాబాద్ పట్టణానికి చెందిన భారత రాష్ట్ర సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పుష్పగుచ్ఛంతో పాటు ప్రత్యేక శుభాకాంక్షల లేఖను ఆయనకు పంపించారు. ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కేటీఆర్ ఆకాంక్షించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే పట్టణంలోని పలువురు ప్రముఖులు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.








