
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ధ్యానంతో పిల్లలకు ఏకాగ్రత కుదురుతుందని, దానివల్ల చదువులో, ఇతర విషయాల్లో ముందుoటారని పిరమిడ్ ధ్యాన సొసైటీ అధ్యక్షులు ధ్యాన గురువు చింత అనిల్ కుమార్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని ఆర్ఆర్ మినీ ఫంక్షన్ హాల్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న బాలల ధ్యానము సాంస్కృతిక ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా వారికి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి అనంతరం ధ్రువ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… వేసవిలో పిల్లలు ఇతర వ్యాపకాలనుండి తమ దృష్టిని మరల్చు కోవడానికి ధ్యాన శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని అన్నారు. ధ్యానం ద్వారా పిల్లల్లో అనేక మార్పులు వస్తాయన్నారు. బాలల్లో మానసిక శారీరక వికాసం తోడ్పడే కార్యక్రమాలు రూపొందించిన గురువు అనిల్ కుమార్ అభినందనీయులని అన్నారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బోరగాల మొగిలి, టాప్ర జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్, పిరమిడ్ సభ్యులు తాళ్లపల్లి రమేష్ గౌడ్, డాన్స్ మాస్టర్ చిదురాల రాజేష్, క్యాస రవీందర్, సందేల వెంకన్న, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ రెడ్డి, వేల్పుల రత్నం, పోగు సమ్మయ్య, విజయ్ తదితరులు పాల్గొన్నారు.





