
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు కుడికాల సురేష్ తల్లి లక్ష్మీదేవి (86) అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతుండడంతో హన్మకొండలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకెళ్లగా ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆమె మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు రమేష్ సురేష్ అశోక్ కుమారులు ఇద్దరు కుమార్తెలు కలరు.

లక్ష్మీదేవి (85)
—ప్రముఖుల సంతాపం
కుడికాల లక్ష్మీదేవి మృతి పట్ల హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు లు ఫోన్లో ప్రగాఢ సానుభూతి ని వ్యక్తం చేయగా, హుజురాబాద్ మునిసిపల్ చైర్ పర్సన్ రోoటాల సుహాసిని, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు కోయల్ కార్ భారతి, ఇల్లందుల సమ్మయ్య, బోరగాల మొగిలి, కాలీదు హుస్సేన్, మాజీ కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, చింత శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాయిత రాములు, సీనియర్ జర్నలిస్టులు ఆవు. నూరి సమ్మయ్య, పరాంకుశం కిరణ్ కుమార్, గడ్డం ధర్మారెడ్డి మండల యాదగిరి మక్సూద్ నరసింహారెడ్డి హర్షవర్ధన్ శ్రీనివాస్, సాగర్, రవీందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, బాపూరావు, వెంకట్ రెడ్డి, మహేష్, దేవేందర్, కుమార్, నాయకులు కోయల్ కార్ బాలాజీ, వేల్పుల రత్నం చందా గాంధీ ప్రభాకర్ రవీందర్ టీఎస్ సింగ్, అశోక్, తదితరులు పాల్గొని సంతాపం వ్యక్తం చేశారు.



నివాళులర్పిస్తున్న పలువురు ప్రముఖులు, పాత్రికేయులు..





