
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఈనెల 20 నుండి 22వ తేదీ వరకు సమీకృత శిక్షణ ఇస్తున్నట్లు హుజురాబాద్ ఎంఈఓ విడపు శ్రీనివాస్ అన్నారు. సోమవారం హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శిక్షణను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మండల స్థాయి సమీకృత ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల శిక్షణలో విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం, ఎఫ్.ఎల్. ఎన్ అమలు, NEP 2020 లక్ష్యాల సాధన,భాష గణితంలో రెమెడియల్ బోధన లో భాగంగా బలహీనంగా ఉన్న విద్యార్థులను గుర్తించి,వారికి ప్రత్యేకంగా ఎలా బోధించాలో ఉపాధ్యాయులు ఇక్కడ నేర్చుకుంటారని అన్నారు.


ఈ శిక్షణా కార్యక్రమంలో కోర్సు కో-ఆర్డినేటర్ తిరునహరి పవన్ కుమార్, రిసోర్స్ పర్సన్స్ అల్లి శ్రీనివాస్, పట్టేం శ్రీనివాస్, తంగళ్ళపల్లి శ్రీనివాస్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.





