
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాబోయే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ బి కిషన్ అన్నారు.

సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో క్యాచ్ ద రెయిన్ అనే కార్యక్రమం జరిగింది. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షపు నీటిని ఒడిసిపట్టడం వలన భాగర్బ జలాలు పెరుగుతాయని అన్నారు. నీటిని కాపాడుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్, హెచ్ఎం సత్య ప్రసాద్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ శ్రీకాంత్, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ పోలు వినయ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏంఈవో శ్రీనివాస్..





