
—ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు పోలాడి రామారావు.
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి మాజీ మంత్రి, అప్పటి కమలాపూర్ మాజీ శాసన సభ్యులు కీ. శే. ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరనీయం అని సీనియర్ నాయకులు, ముద్దసాని వీరాభిమాని రైతు ప్రజా సంఘాల జాతీయి అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొన్నారు.

కీ.శే. ముద్దసాని దామోదర్ రెడ్డి 70వ జయంతి సందర్బంగా కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని మానకొండూర్ మండల సరిహద్దులోని ప్రధాన హైవే సదాశివపల్లి కూడలి వద్ద నెలకొల్పిన దామోదర్ రెడ్డి విగ్రహానికి నాయకులతో కలిసి పోలాడి రామారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ముందుగా నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఆయన స్వీట్లు, పండ్లు పంపిణి చేశారు.

ఈ సందర్బంగా పోలాడి రామారావు మాట్లాడుతూ 29ఏళ్లకే ఎమ్మెల్యేగా, 30ఏళ్ల కే మంత్రిగా పని చేసిన దామోదర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ మంత్రి వర్గంలో కరవు, భూగర్భ గనుల శాఖల మంత్రి గా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాబినెట్ లో ప్రభుత్వ సర్వీసుల, సాంకేతిక విద్యా శాఖ, రవాణా శాఖల మంత్రిగా పని చేసి కమలాపూర్ నియోజకవర్గం తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధికి విశేష సేవలు అందించారన్నారు. వరుసగా 4 సార్లు ఎంఎల్ గా గెలుపొందిన ముద్దసాని పాత హుజురాబాద్ తాలూకా పరిధిలోని ఎస్ ఆర్ఎస్ పి ఆయకట్టు రైతులందరికి చివరి రైతు ఆయకట్ వరకు కెనాల్ ద్వారా నీళ్లు అందేవరకు నిత్యం కాలువల వెంట పర్యవేక్షణ చేసిన ముద్దసాని రైతుల్లో చిరస్తాయిగా నిలిచారన్నారు.
నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పల్లెకు బీటీ రోడ్లు నిర్మించారన్నారు. అను నిత్యం సామాన్యులకు అర్ధ రాత్రి దాటినా కూడా పేద, బడుగు బలహీన వర్గాలకు, రైతులకు, యువతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి అవిశ్రాంతంగా కృషి చేశారాన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉమ్మడి జిల్లాలో టీడీపీని పటిష్టం చేసి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే వారన్నారు.
కరీంనగర్ జిల్లా టైగర్ గా డేరింగ్, డాషింగ్ డైనమిక్ లీడర్ గా దామన్నగా జిల్లా సామాన్య ప్రజల్లో మాస్ లీడర్ గా సినీ హీరోలకు లేని ప్రజా ధరణతో చెరగని అన్ని వర్గాల్లో ముద్రవేసుకున్నారన్నారు. దామోదర్ రెడ్డి లాంటి నాయకులు నేడు అరుదు అని అన్నారు.
ఎందరో సామాన్య కార్యకర్తలను నాయకులుగా ఎమ్మెల్యేలుగా తీర్చి దిద్దిన దామోదర్ రెడ్డి మా అందరికి స్ఫూర్తి దాయకమని ఆయన ఆశయాలను పాటిస్తూ ఆయన బాటలో నడవడమే నిజమైన నివాళి అని పోలాడి రామారావు ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, స్థానిక కార్పొరేటర్ ఆకుల నందిని ఉదయ్, నాయకులు కొత్తూరు జగన్ గౌడ్, ముద్దసాని కృష్ణారెడ్డి, ఆడెపు కమలాకర్, సింగిరెడ్డి ఎల్లారెడ్డి, బండి నరేష్, కార్పొరేటర్ అజయ్ గౌడ్, కనకం కుమార్, తాళ్లపల్లి అంజయ్య లతో పాటు ముద్దసాని అభిమానులు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.





