
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక ప్రాతిపదికన కంప్యూటర్స్, గణితం సబ్జెక్టుల్లో ఒక్కొక్క అతిథి అధ్యాపకుల (గెస్ట్ ఫ్యాకల్టీ) నియామకం కోసం అర్హులైన, ఆసక్తి కలిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి ఇందిరాదేవి తెలిపారు.
అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీలు అయితే 50 శాతం, ఓసీ, బీసీలు అయితే 55 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసి ఉండాలన్నారు. అలాగే నెట్, సెట్, పీహెచ్డీలలో ఏదైనా ఒకటి అదనపు అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. అలాగే ఇంగ్లీష్ మీడియంలో బోధించగలిగే సామర్థ్యం ఉండాలన్నారు.
ఒకవేళ ఇట్టి పోస్టుకు నెట్, సెట్, పీహెచ్డీ అర్హులు అప్లై చేసుకోకపోతే డిగ్రీ స్థాయిలో బోధన అనుభవం కలిగిన వారికి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుందన్నారు.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు ఒక సెట్ జిరాక్స్ ప్రతులను జతచేస్తూ దరఖాస్తులను ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హుజురాబాద్ లో జూలై 24వ తేదీ సాయంత్రం 4.00 గంటలలోపు అందజేయాలని, తేదీ 27.07.2026 రోజున ఉదయం 11 గంటలకు కళాశాలలో డెమో, ఇంటర్వ్యూ నిర్వహిస్తామని, గడువు తేదీలోగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావలెను అని ప్రిన్సిపాల్ తెలిపారు.

స్వర్ణోదయం డిజిటల్ పేపర్ యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు..
తెలియజేస్తున్న వారు: జి వివేక్, పిఎసిఎస్ సెక్రటరీ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.




