Oplus_16908288
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూన్ 7 : వాతావరణ కాలుష్యం మానవ మనుగడకు ముప్పుగా పరిణమి స్తోందని, మానవ తప్పిదాలు, ఆధునిక జీవన విధానం ఆచరణ, ప్లాస్టిక్ విస్తృత వినియోగం జీవ వైవిధ్యాన్ని దెబ్బతీసి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని, దీని నివారణకు విరివిగా మొక్కలు నాటాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, ఓసీ జేఏసీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు పూసల ప్రభావతిరెడ్డి కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు చోట్ల పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభావతిరెడ్డి మాట్లాడుతూ…
చెట్లు ఉంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, విపరీతమైన ఎండలు, పర్యావరణ కాలుష్యం వంటి పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరు చెట్లను పెంచడం చాలా అవసరమన్నారు. తమవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించి పచ్చదనంతో నింపాలని కోరారు. రోజు రోజుకు దెబ్బతింటున్న పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పాలిథిన్, ప్లాస్టిక్ట్ వాడకానికి దూరంగా ఉండి, ఆరోగ్యవంతమైన వాతావరణ నిర్మాణానికి అందరూ సహకరించాలన్నారు. మొక్కలు నాటి బావితరాలకు బంగారు భవిష్యత్ ను అందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణపై నిరంతరం అధికారులు, ప్రజాప్రతి నిధులు అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నింపాలని ప్రభావతిరెడ్డి కోరారు. నామమాత్రంగా మొక్కలు నాటి తమ పని అయిపోయింది అన్నట్లుగా వ్యవహరించకుండా ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు తమ పిల్లలను ఏ విధంగా అయితే పెంచుతామో అదే విధంగా వాటి సంరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. వర్షాకాలానికి ముందే మొక్కలు నాటినట్లయితే వర్షం నీటికి త్వరగా పెరగడం వల్ల వాటిని సంరక్షించడం సులువుగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.





