
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి 50వ జన్మదిన వేడుకలు శుక్రవారం హుజూరాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బి ఆర్ ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.


ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ….ఢిల్లీలో విద్యార్థులు, యువతపై జరుగుతున్న అణచివేతకు నిరసనగా కేటీఆర్ తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తూ వారికి సంఘీభావం ప్రకటించడం ఆయనకు ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. నిరసన తెలిపే హక్కును అణచివేయడం తగదని, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందని , కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు అందాల్సిన సాగునీటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ , కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య, గందె శ్రీనివాస్, బండ నరేష్, మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ , సర్పంచులు కట్కూరి మల్లారెడ్డి, జూపాక వెంకటేష్, ఉప సర్పంచ్ సతీష్, మాజీ కౌన్సిలర్లు ప్రతాప తిరుమల్ రెడ్డి, అపరాధ ముత్యంరాజు, డిష్ కుమార్, తాళ్లపెల్లి శ్రీనివాస్, ఇమ్రాన్, కొండ్ర నరేష్, కోయడ కమలాకర్, నాయకులు పోరెడ్డి శంతన్ రెడ్డి, ఐలయ్య, మైకేల్, కానీగంటి శ్రీనివాస్, రమేష్, రేణుక, ప్రభావతిరెడ్డి, పంజాల శ్రీధర్, కొలిపాక సమ్మయ్య, శివ, కిరణ్, పిళ్లి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.





