
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సమగ్ర ఓటు సవరణ నమోదు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్వోలు కో ఆర్డినేటర్లు చురుకుగా పాల్గొనాలని హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు, సుడా మాజీ ఛైర్మెన్, హుజురాబాద్ సర్ ఇంచార్జి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సై ఆర్బిఎల్ ఓ కో ఆర్డినేటర్లతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
ఎస్ ఐఆర్ వారాల సమర్పణ తేదీ దగ్గర పడుతున్నా కొద్ది కాంగ్రెస్ పార్టీ నమోదు ప్రక్రియలో బిఎల్ఏ ల పనిలో వేగం పెంచాలన్నారు. ఇప్పటివరకు బిఎల్ఏ వద్ద ఉన్న పూర్తి సమాచారం కో ఆర్డినేటర్ల వద్ద ఉందా లేదా అని ప్రశ్నించారు? గ్రామాల్లో ఓటు నమోదు ఫారం రాకపోతే బిఎల్ఓ కో ఆర్డినేటర్లకు తెలపాలని అక్కడ నుండి మాకు చేరవేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ సర్ పై సీరియస్ గా దృష్టి పెట్టింది కావున ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజురాబాద్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారని వారన్నారు. తెలిసి ఒక్క ఓటు కూడా వృధా కాకుండా చూడాలని కార్యకర్తలకి సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్, వీణవంక మండల నాయకులు, గ్రామాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఎస్ ఐఆర్ పై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ప్రణవ్ బాబు..





