
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పద్మశాలి సంఘ నాయకులను శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని చేనేత సంఘంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడి తల ప్రణవ్ బాబు సన్మానించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన బండారి సదానందం, పద్మశాలి చేనేత పారిశ్రామిక సంఘం అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన ఏలిగేటి ఉపేందర్ , ఉపాధ్యక్షులు తాటిపాముల తిరుపతి, కోశాధికారి గుండేటి మహాదేవ్, డైరెక్టర్లను ఆయన సన్మానించారు.




అనంతరం చేనేత కార్మికుల పనిని చేనేత సంఘంలో ఆయన ప్రత్యక్షంగా పరిశీలించి కార్మికులతో ఆయన మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. చేనేత కార్మికుల సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా పూర్తిస్థాయిలో అమలు చేసేలా తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని, కౌన్సిలర్లు కోయల్ కార్ భారతి, సొల్లు సునీత , సందమల్ల పుణ్య, నాయకులు కాజీపేట శ్రీనివాస్, కోయల్ కార్ బాలాజీ, సందమల్ల బాబు, పద్మశాలి సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగెం సత్యనారాయణ, కార్యదర్శి చిలుక మారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొండా గణేష్, సాగర్, లక్ష్మి, శ్రీనివాస్, మంచికట్ల కమలాకర్, దేవయ్య, మార్త రవీందర్ తదితరులు పాల్గొన్నారు.





