
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని రంగనాయక గుట్ట వద్ద గల జ్ఞనాసరస్వతి ఆలయంలో బుధవారం అంగన్వాడీ పిల్లలకు సామూహిక అక్షరాభ్యాస క్యారక్రమం జరిగింది.


ఈ సందర్భంగా హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ….. అంగన్వాడీలలో చదివే పిల్లలకు ఆటపాటలతో విద్యాబోధన చేయడంతో పాటు వారిని అన్ని స్థాయిలలో తీర్చిదిద్ది వారిని ఉన్నత స్థాయికి చేరుకునేలా రూపొందించాలని ఆమె ఆకాంక్షించారు. పౌష్టిక ఆహారం అందించి పిల్లల ఎదుగుదలకు, మేదా శక్తి పెరిగేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఐసిడిఎస్ సిడీపీఓ మరాఠీ సుగుణ, 5వ వార్డ్ కౌన్సెలర్ సొల్లు సునీత, ఆలయ పూజారి ప్రదీప్, ఐసీడీస్ సూపర్వైజర్ రమ్య, వివిధ అంగన్వాడీల టీచర్స్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ చైర్ పర్సన్ సుహాసిని, సిడిపిఓ సుగుణ, అంగన్వాడీ టీచర్లు, పిల్లలు, తల్లిదండ్రులు..





