
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూన్ 17: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల పరిధిలోని చెల్పూర్ గ్రామంలో సమాచార హక్కు చట్టం (ఆర్.టి.ఐ) సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ ఆదేశాల మేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చెల్పూర్ గ్రామ ఆర్.టి.ఐ నూతన అధ్యక్షుడిగా ఆకునూరి కుమారస్వామిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

తన ఏకగ్రీవ నియామకానికి సహకరించిన ఆర్.టి.ఐ సాధన కమిటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చంటి ముదిరాజ్ , కాట్రపల్లి గ్రామ అధ్యక్షులు ఎం రాజు హుజూరాబాద్ మండల ప్రధాన కార్యదర్శి బండ నరేందర్ నూతన అధ్యక్షులు ఆకునూరి కుమారస్వామి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.





