
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నిరుపేదలకు అండగా ఇందిరమ్మ ఇల్లు నిలుస్తుందని, రేవంత్ ప్రభుత్వం లక్షలాదిమంది నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడం జరుగుతుందని హుజురాబాద్ మునిసిపల్ 29వ వార్డ్ కౌన్సిలర్ బొరగాల మొగిలి-లక్ష్మి పేర్కొన్నారు. ఈరోజు 29వ వార్డులో పర్లపెల్లి సుమలత- సదానందంల నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కౌన్సిలర్ దంపతులు పాల్గొని లబ్ధిదారులను నూతన వస్త్రాలతో సత్కరించారు.


ఈ సందర్భంగా కౌన్సిలర్ మొగిలి మాట్లాడుతూ ప్రతి మనిషికి కూడు గూడు గుడ్డ అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించి అందులో అతి ముఖ్యమైన గూడును(ఇంటిని) ప్రతి ఒక్కరి సొంతింటి కలను నిజం చేస్తూ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. పేద ప్రజలు ఇందిరమ్మ ఇళ్లన సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. కాగా కౌన్సిలర్ దంపతులను ఇందిరమ్మ లబ్ధిదారులు శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ లత, మహిళా కాంగ్రెస్ నాయకురాలు మొలుగు రాధ, యూత్ కాంగ్రెస్ నాయకులు రేణికుంట్ల సందీప్, చిట్యాల రేవంత్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు.





